33 సర్గ
Download శుద్ద పాఠ్యం | Audio
సొ౽వతీర్య ద్రుమాత్తస్మా ద్విద్రుమప్రతిమాననః |
వినీతవేషః కృపణః ప్రణిప త్యొపసృత్య చ || 1 ||
తా మబ్రవీ న్మహాతేజా హనూమాన్ మారుతాత్మజః |
శిరస్యంజలి మాధాయ సీతాం మధురయా గిరా || 2 ||
కా ను పద్మ పలాశాక్షీ క్లిష్టకౌశేయ వాసినీ |
ద్రుమస్య శాఖామాలంబ్య తిష్ఠసి త్వమనిందితా || 3 ||
కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి శొకజమ్ |
పుండరీకపలాశాభ్యాం విప్రకీర్ణ మివోదకమ్ || 4 ||
సురాణామసురాణాం వా నాగ గంధర్వ రక్షసామ్ |
యక్షాణాం కిన్న రాణాం వా కా త్వం భవసి శొభనే || 5 ||
కా త్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే |
వసూనాం వా వరారొహే దేవతా ప్రతిభాసి మే || 6 ||
కిన్ను చంద్రమసా హీనా పతితా విబుధాలయాత్ |
రొహిణీ జ్యొతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠా సర్వ గుణాన్వితా || 7 ||
కొపా ద్వా యది వా మొహా ద్భర్తార మసితేక్షణా |
వసిష్ఠం కొపయిత్వా త్వం నాసి కల్యాణ్యరుంధతీ || 8 ||
కొ ను పుత్రః పితా భ్రాతా భర్తా వా తే సుమధ్యమే |
అస్మాల్లొకా దముం లొకం గతం త్వ మనుశొచసి || 9 ||
రొదనా దతినిశ్వాసా ద్భూమిసంస్పర్శనాదపి |
న త్వాం దేవీ మహం మన్యే రాజ్ఞ సంఙ్ఞా వధారణాత్ || 10 ||
వ్యంజనాని చ తే యాని లక్షణాని చ లక్షయే |
మహిషీ భూమి పాలస్య రాజ కన్యాసి మే మతా || 11 ||
రావణేన జన స్థానా ద్బలా దపహృతా యది |
సీతా త్వమసి భద్రం తే త్వనుమాచక్ష్వ పృచ్ఛతః || 12 ||
యథా హి తవ వై దైన్యం రూపం చాప్యతిమానుషమ్ |
తపసా చాన్వితొ వేష స్త్వం రామమహిషీ ధ్రువమ్ || 13 ||
సా తస్య వచనం శ్రుత్వా రామ కీర్తన హర్షితా |
ఉవాచ వాక్యం వైదేహీ హనూమంతం ద్రుమ ఆశ్రితమ్ || 14 ||
పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః |
స్నుషా దశరథ స్యాహం శత్రుసైన్యప్రతాపినః || 15 ||
దుహితా జనక స్యాహం వైదేహస్య మహాత్మనః |
సీతేతి నామ నామ్నా౽హం భార్యా రామస్య ధీమతః || 16 ||
సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే |
భుంజానా మానుషాన్ భొగాన్ సర్వ కామ సమృద్ధినీ || 17 ||
తత్ర త్రయొదశే వర్షే రాజ్యే చేక్ష్వాకు నందనమ్ |
అభిషేచయితుం రాజా సోపాధ్యాయః ప్రచక్రమే || 18 ||
తస్మిన్ సంభ్రియమాణే తు రాఘవ స్యాభిషేచనే |
కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీత్ || 19 ||
న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భొజనమ్ |
ఎష మే జీవిత స్యాంతొ రామో యద్యభిషిచ్యతే || 20 ||
యత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమ |
తచ్చేన్న వితథం కార్యం వనం గచ్ఛతు రాఘవః || 21 ||
స రాజా సత్య వాగ్దేవ్యా వర దాన మనుస్మరన్ |
ముమొహ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరం అప్రియమ్ || 22 ||
తతస్తు స్థవిరొ రాజా సత్య ధర్మే వ్యవస్థితః |
జ్యేష్ఠం యశస్వినం పుత్రం రుదన్ రాజ్య మయాచత || 23 ||
స పితుర్వచనం శ్రీమాన్నభిషేకాత్ పరం ప్రియమ్ |
మనసా పూర్వ మాసాద్య వాచా ప్రతిగృహీతవాన్ || 24 ||
దద్యాన్ న ప్రతిగృహ్ణీయాన్న బ్రూయత్ కించిదప్రియమ్ |
అపి జీవిత హేతొ ర్వా రామః సత్య పరాక్రమః || 25 ||
స విహాయోత్తరీయాణి మహార్హాణి మహాయశాః |
విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్ || 26 ||
సాహం తస్యాగ్రత స్తూర్ణం ప్రస్థితా వన చారిణీ |
న హి మే తేన హీనాయా వాసః స్వర్గే౽పి రొచతే || 27 ||
ప్రాగేవ తు మహాభాగ స్సౌమిత్రి ర్మిత్ర నందనః |
పూర్వజ స్యానుయాత్రార్థే ద్రుమ చీరైరలంకృతః || 28 ||
తే వయం భర్తు రాదేశం బహు మాన్య దృఢ వ్రతాః |
ప్రవిష్టాః స్మ పురా౽దృష్టం వనం గంభీర దర్శనమ్ || 29 ||
వసతొ దండకారణ్యే తస్యాహ మమితౌజసః |
రక్షసా౽పహృతా భార్యా రావణేన దురాత్మనా || 30 ||
ద్వౌ మాసౌ తేన మే కాలొ జీవితానుగ్రహః కృతః |
ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతః త్యక్ష్యామి జీవితమ్ || 31 ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే, వాల్మీకియే, ఆదికావ్యే సుందరకాణ్డే త్రయస్త్రింశః సర్గః